Cold and Cough:గొంతు నొప్పి, దగ్గు, కఫం, శ్లేష్మం మందులు లేకుండా చిటికెలో తగ్గాలంటే…
Cold and Cough Home Remedies: సీజన్ మారినప్పుడు దగ్గు,గొంతు నొప్పి,కఫం, శ్లేష్మం వంటి శ్వాస సంబంద సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. మన వంటింటిలో ఉన్న కొన్ని సహజసిద్దమైన వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనే వేసి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. తేనే, పసుపు రెండింటిలో ఉన్న లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, గొంతు in ఫెక్షన్ వంటి సమస్యలకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కొమ్ములను ఆడించి పొడిగా చేసి వాడితే మంచిది. మార్కెట్ లో దొరికే ప్యాకెట్ పసుపు వాడకుండా ఉంటేనే మంచిది.
మరొక చిట్కా తెలుసుకుందాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనే, పావు స్పూన్ పసుపు,రెండు స్పూన్ల అల్లం రసం, పావు స్పూన్ లో సగం మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉదయం,సాయంత్రా, రోజులో రెండు సార్లు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే రెండు రోజుల్లోనే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రెండు చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే మందులను ఎక్కువగా వాడితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News