Diabetic Tips:షుగర్ ఉన్నవారు మష్రూమ్స్ తినవచ్చా…తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Mushroom : షుగర్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాలి. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. షుగర్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఏ ఆహారం తీసుకుంటే మంచిది…అనే విషయం మీద ఎన్నో సందేహాలు ఉంటాయి.
డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు మష్రూమ్స్ తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. మష్రూమ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటంలో సహాయపడతాయి.
వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. మష్రూమ్స్ లో ఉండే విటమిన్ బి మరియు పాలీశాకరైడ్ వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడమే కాకుండా, ట్రైగ్లిజరైడ్ నిర్వహణ మరియు ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
దాంతో గుండె సమస్యలు తొలగిపోతాయి. మష్రూమ్స్ లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉండుట వలన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.మష్రూమ్స్ లో యాంటీఆక్సిడెంట్, ఫైటోకెమికల్ లక్షణాలు ఉంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్‌ను యాంటీ ఫంగల్‌గా మారుస్తాయి. దీని కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మష్రూమ్స్ లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి అధిక బరువు ఉన్నవారికి కూడా మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన సోడియం శోషణను తగ్గించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి వారంలో రెండు సార్లు మష్రూమ్స్ తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.