Surya Son Of Krishnan:“సూర్య సన్ ఆఫ్ కృష్ణన్” సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Surya Son Of Krishnan:2008లో సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సూర్యకు తమిళ సినీ రంగంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రీమేక్ సినిమా రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ రాబట్టటం అంటే మాములు విషయం కాదు. అప్పట్లో తమిళంలో హిట్ అయినా తెలుగులో ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అయితే బాగుంటుందని రామ్ చరణ్ ని సంప్రదించాడు. అయితే అప్పుడే చరణ్ చిరుత సినిమా విడుదల అయింది. గౌతం మీనన్ చెప్పిన కథ రామ్ చరణ్ కి కూడా నచ్చింది. అయితే తండ్రి పాత్ర ఇంత చిన్న వయస్సులో తనకు సెట్ కాదని భయంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ ఈ కథను సూర్యకి చెప్పటం వెంటనే ఓకే చెప్పటం జరిగింది.