Healthhealth tips in telugu

How Many Steps A Day। రోజుకి కనీసం ఎన్ని అడుగులు నడవాలి? ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా…?

How Many Steps A Day: ప్రతి రోజు నడవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. నడక వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు నడవమని డాక్టర్స్ కూడా చెప్పుతూ ఉంటారు. అయితే రోజుకి ఎంత దూరం నడవాలి. ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి… అనే విషయానికి వచ్చే సరికి కొంత మంది రోజుకి 6000 అడుగులు నడిస్తే సరిపోతుందని చెప్పుతారు.

అయితే ఇటీవల జరిగిన పరిశోదనలో ఒక మనిషి ప్రతి రోజు దాదాపుగా 4000 అడుగులు నడిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని తెలిసింది. ముఖ్యంగా గుండెకు సంబందించిన సమస్యలు ఉండవని నిపుణులు చెప్పుతున్నారు. రోజుకు కనీసం 1,000 అడుగులు నడిస్తే ఏదైనా అనారోగ్య కారణం వల్ల చనిపోయే ప్రమాదం 15 శాతం తగ్గుతుంది.

మరో 500 అడుగులు ఎక్కువ నడిస్తే గుండెకు సంబందించిన వ్యాధులతో మరణించే ప్రమాదం 7 శాతం తగ్గుతుంది. అయితే కనీసం రోజుకు 4 వేల అడుగులైనా నడవాలి. రోజుకు 7000 నుంచి 13,000 వరకు అడుగులు వేసే యుక్త వయస్కుల వారిలో ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు, ఒక రోజులో 6,000 నుంచి 10,000 నడవ గలిగితే వారు వ్యాధుల కారణంగా మరణించే అవకాశాలు 42 శాతం తగ్గుతుంది.

అయితే డాక్టర్ సూచన ప్రకారం నడిస్తే మంచిది. ప్రతి రోజు వ్యాయామం ఉండటం మంచిది. ప్రతి రోజు వ్యాయామం అనేది ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. ఎప్పుడైనా సమస్య రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News