Healthhealth tips in telugu

Tamarind seeds For Knee Pain:ఈ గింజలను ఇలా తీసుకుంటే కీళ్లలో గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు అనేవి అస్సలు ఉండవు

Tamarind seeds powder for Knee pains:ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే కీళ్ళనొప్పులు వస్తున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ల వయస్సులో వచ్చే నొప్పులు చాలా చిన్న వయస్సులోనే రావటంతో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

చింతపండును మనం ప్రతిరోజు వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండులో ఉండే గింజలు నల్లని రంగులో మెరుస్తూ ఉంటాయి. చింతపండు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.

ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా కీళ్ళ నొప్పులు ఉన్నవారికి చింత గింజలను సిఫార్సు చేస్తున్నారు. చింత గింజలను నీటిలో ఒక రోజు నానబెట్టి…పై తొక్క తీసి…ఆరబెట్టి వేగించి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. చింతగింజల పొడి కూడా మార్కెట్ లో లభ్యం అవుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం అర స్పూన్ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి.

ఈ విధంగా మూడు నెలల పాటు తీసుకుంటే కీళ్లలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటివి అన్ని తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. రక్తంలో కొవ్వు అడ్డుపడకుండా చింత గింజలు సహాయపడతాయి. ఈ గింజలలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. .

దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేయడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది..

అరస్పూన్ చింత గింజల పొడిని ఒక స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గించటంలో సహాయపడుతుంది. అలాగే చింత గింజ‌ల్లోనూ మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, ఫైబ‌ర్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News