Healthhealth tips in telugu

Green Tea:గ్రీన్ టీ ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా ..అసలు నమ్మలేరు

Green Tea Benefits in telugu : మనం తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది Green Tea తాగుతున్నారు. Green Tea తాగే విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి ఆరోగ్యకరమైన ఆహారం,డ్రింక్స్ తీసుకోవటం ప్రారంభించారు. అలాంటి వాటిలో గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పటంతో అందరూ గ్రీన్ టీని త్రాగటం ప్రారంభించారు.

అధిక బరువు సమస్యతో బాధపడేవారు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడేవారు,అందమైన మెరిసే చర్మం కావాలని అనుకునేవారు, ఎప్పుడు ఉషారుగా ఉండాలని అనుకునేవారు, మెటబాలిజం బాగుండాలని అనుకునేవారు గ్రీన్ టీ త్రాగవచ్చు. అయితే గ్రీన్ టీని త్రాగటానికి సమయం ఉంటుంది. అలాగే సరైన పరిమాణంలో మాత్రమే త్రాగాలి.

నీటిని త్రాగినట్టుగా ఒక కప్పు తర్వాత మరో కప్పు త్రాగకూడదు. ఇలా త్రాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే అది తప్పు. గ్రీన్ టీని సరైన సమయంలో త్రాగకపోతే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి గ్రీన్ టీ త్రాగే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ టీలో కెఫీన్,టానిన్స్ ఉంటాయి.

ఇవి గ్యాస్ట్రిక్ జ్యూస్ మీద ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం కారణంగా వికారం,పొట్టలో ఎసిడిటి సమస్య,గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తాయి. అందువల్ల గ్రీన్ టీని సరైన సమయంలో సరైన పరిమాణంలో తీసుకుంటే అందులోని ప్రయోజనాలు అన్ని శరీరానికి అందుతాయి. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువ పరిమాణంలో తీసుకోవటం వలన మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి.

అందువల్ల గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. చాలా మంది ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకుంటే శరీరం శుభ్రం అవుతుందని నమ్ముతారు. అది నిజం కాదు. గ్రీన్ టీలో ఉండే కెఫీన్ కడుపులో గ్యాస్ట్రిక్ జ్యూస్ ని డైల్యూట్ చేసి గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది.

గ్రీన్ టీలో ఉన్న అన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే భోజనానికి అరగంట ముందు లేదా భోజనము అయ్యాక రెండు గంటల తరవాత తీసుకోవాలి. గ్రీన్ టీలో పాలు, పంచదార కలపకూడదు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పాలలో ఉండే ప్రోటీన్స్,కేలరీలు, పంచదారలో ఉండే ఫ్లెవనాయిడ్స్ వ్యతిరేక రియాక్షన్స్ ని కలిగిస్తాయి. కాబట్టి గ్రీన్ టీలో పాలు,పంచదార కలపకుండా త్రాగితే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

గ్రీన్ టీలో తేనే కలుపుకొని త్రాగవచ్చు. తేనెలో ఉండే విటమిన్స్ ఫ్యాట్ కరిగించటానికి,కేలరీలు బర్న్ చేయటానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ త్రాగకూడదు. భోజనం చేసిన వెంటనే త్రాగితే గ్రీన్ టీలో ఉండే కెఫీన్ జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. రోజుకి రెండు కప్పుల గ్రీన్ టీని మాత్రమే ట్రాగాలి.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్,ఫ్లెవనాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో టాక్సీన్స్ పెంచి కాలేయం మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల గ్రీన్ టీని సరైన పరిమాణంలో సరైన సమయంలో తీసుకుంటే గ్రీన్ టీలో ఉన్న అన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News