Green Tea For Face: గ్రీన్ టీని ఇలా వాడితే మచ్చలేని మృదువైన చర్మం మీ సొంతం…అందాన్ని రెట్టింపు చేస్తుంది
Green Tea For Face:ప్రస్తుత రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందంగా ఉండటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మెరిసేలా చేసుకోవచ్చు.
Green Tea అనేది చర్మ సంరక్షణలో చాలా బాగా సహయాపడుతుంది. green టీని ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. Green Tea ఉపయోగించి ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే మచ్చలేని మృదువైన మెరిసే చర్మం మీ సొంతమవడం ఖాయం.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ), రెండు లెమన్ స్లైసెస్ వేసుకుని వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి నీటిని వడకట్టి చల్లారబెట్టాలి.
ఒక బౌల్ లో మూడు స్పూన్ల నీటిని తీసివేసిన పెరుగు, నాలుగు స్పూన్ల Green Tea నీటిని వేసి బాగా కలిపి ముఖానికి,మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం వస్తుంది.
ముడతలు లేకుండా చర్మం బిగుతుగా, మృదువుగా మారుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు కూడా ఏమి లేకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది. కాబట్టి మచ్చలేని కాంతివంతమైన చర్మాన్ని( Spotless Skin ) కోరుకునే వారు తప్పకుండా గ్రీన్ టీతో ఈ సింపుల్ రెమెడీని పాటించండి.
చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ చిట్కాను పాటించి అందమైన తెల్లని మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోండి. కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/