Jaggery With Curd : ఈ సీజన్ లో పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే…డాక్టర్ అవసరమే ఉండదు
Jaggery With Curd: మనం తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది. సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గించటానికి తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలా మంది పెరుగు తినటానికి ఇష్టపడరు. అలాంటి వారు ఇప్పుడు చెప్పిన విధంగా తింటే సరిపోతుంది.
ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా… వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ సీజన్ లో ప్రతి రోజు పెరుగు, బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బెల్లం, పెరుగు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని కేవలం మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయంలో తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల దంతాలు ఎముకలు బలంగా మారుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడి గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కడుపు నొప్పి సమస్య ఉన్నప్పుడు పెరుగులో కొంచెం బెల్లం కలిపి తీసుకుంటే నిమిషంలోనే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది, ఆకలిని తగ్గించడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువైపోయింది. పెరుగులో బెల్లం కలిపి తింటే శరీరానికి అవసరమైన ఐరన్. అంది రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తి చేయటానికి సహాయపడుతుంది.
శారీరక బలహీనత తగ్గిస్తుంది. అలసట నీరసం నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది. జలుబు సమస్యతో బాధపడేవారు పెరుగులో బెల్లంతో పాటు కాస్త మిరియాలపొడి వేసుకుని తింటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News