Healthhealth tips in telugu

Sleeping:రోజుకు 5 గంటల కంటే తక్కువసేపు పడుకుంటే ఏమి అవుతుందో తెలుసా …?

Less Sleeping:మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర అనేది మన ఆరోగ్యం మీద కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న బిజీ జీవనశైలిలో మనలో చాలామంది నిద్ర విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు.

మనిషికి రోజుల్లో కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం. అయితే మనలో చాలా మంది ఐదు గంటలకు అంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. అలా ఐదు గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, హృదయ స్పందన రేటు తగ్గి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

అలాగే అధిక బరువు, మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత లేకపోవడం, డయాబెటిస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాగే నిద్రలేమి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనమై రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా తగ్గి ఏ పని మీద దృష్టి సారించలేరు.

కాబట్టి మన జీవితంలో నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రతి రోజు కనీసం 6 నుంచి 7 గంటల సమయం నిద్ర పోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఆరోగ్యం అబ్గుంటుంది. ఏ పని అయినా చురుకుగా చేస్తాం. ఒకవేళ నిద్రలేమి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చూసుకోవాలి.

మన ఆరోగ్యానికి ఆహారం,నిద్ర అనేవి చాలా ముఖ్యం. ఈ రెండింటిని విస్మరిస్తే సమస్యలు అధికంగానే వస్తాయి. కాబట్టి ప్రశాంతంగా నిద్ర పోవటానికి ప్రయత్నం చేయాలి. రాత్రి సమయంలో సాధ్యమైనంత వరకు లాప్ టాప్, స్మార్ట్ ఫోన్స్ కి దూరంగా ఉంటేనే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News