Devotional

Sravana Masam:శ్రావణ మాసంలో ఇచ్చే తాంబూలంలో ఈ వస్తువులను తప్పనిసరిగా పెట్టాలి…లేకపోతే…?

Sravana Masam 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం సాధారణంగా ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17వ తేదీ నుంచి నిజ శ్రావణం ప్రారంభమైంది. శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ మంగళవారం నోములు,శ్రావణ శుక్రవారం పూజలతో చాలా హడావిడిగా ఉంటుంది.

శ్రావణ మాసంలో ఈ పూజలు చేసేటప్పుడు తాంబులం తప్పనిసరిగా ఇస్తూ ఉంటాం. అయితే తాంబులం ఇవ్వటానికి కూడా ఒక పద్దతి ఉంది. శ్రావణ మంగళవారం ఇచ్చే తాంబులంలో తమలపాకు,వక్క,శనగలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవారు సౌభాగ్యానికి ఈ వ్రతాలు,పూజలను చేస్తూ ఉంటారు.

ఆడవారికి ఎక్కువగా చంద్ర దోషం,కుజ దోషము ఉంటాయి. అలాగే సూర్య అనుగ్రహం కూడా ఉండాలి. అందువల్ల ఈ రెండు దోషాలు పోయి సూర్య అనుగ్రహం పొందటానికి తమలపాకు,వక్క,శనగలు ఈ మూడు వస్తువులను తాంబులంగా ఇస్తారు.

గురు బలానికి శనగలను ఇస్తారు. అలాగే మారిన ఋతువులో ఉడికించిన శనగలను తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా వ్యక్తిగతంగా,ఆరోగ్యపరంగా,కుటుంబ పరంగా అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి. అందువల్ల మన పెద్దలు ఈ తాంబులం ఈ విధంగా ఇవ్వాలని నియమం పెట్టారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News

https://www.chaipakodi.com/