Beauty TipsHealthhealth tips in telugu

Yellow Teeth:పళ్ళు పసుపు రంగులోకి మారాయా… మెడిసిన్స్ అక్కర్లేదు.. ఈ చిట్కాతో ముత్యాల్లా మెరవడం ఖాయం..!

Yellow Teeth Home Remedies:ముఖంలో పళ్ళు అందాన్నిస్తాయి ముత్యాల్లాంటి పళ్ళు ఉండాలని చాలామంది కోరుకుంటారు మనం నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ముత్యాల్లాంటి పలువరస కనబడితే ముఖం అందంగా కనబడుతుంది. అలాగే ఎదుటివారు కూడా మాట్లాడటానికి ఇష్టపడతారు.

కానీ ఈ రోజుల్లో చాలామంది పళ్ళు తెల్లగా లేకుండా పసుపురంగులో గార పట్టినట్టు ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు ఇంటి చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండటమే కాకుండా పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి..

దంతాలు పసుపు రంగులో ఉంటే…కొబ్బరి నూనెతో దంతాలను రుద్దాలి. ఈ విధంగా రుద్దటం వలన కొబ్బరి నూనెలో ఉన్న లక్షణాలు దంతాల మీద ఉన్న పసుపు రంగును క్రమంగా తెల్లగా మారేలా చేస్తుంది. రాత్రిపూట దంతాల మీద నారింజ తొక్కను కూడా రుద్దవచ్చు. దీంతో నోటి దుర్వాసన పోయి దంతాలపైన పేరుకున్న మురికి తొలగిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ ఆవ నూనె వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ తో 3 రోజుల పాటు బ్రష్ చేస్తే దంతాలపై పసుపు పొరను చాలా వరకు తగ్గుతుంది.

పూర్వకాలంలో దంతాలను శుభ్రం చేసుకోవటానికి వేప పుల్లను వాడేవారు. వేప మన దంతాల పసుపు రంగును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. పేస్ట్ తో కన్నా వేపపుల్లతో దంతాలను బ్రష్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇది కూడా చదవండి: Black Pepper:నల్ల మిరియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

https://www.chaipakodi.com/