MoviesTollywood news in telugu

Tollywood:వీల్ చైర్ కి పరిమితమై రాణించిన స్టార్స్ ఎంత మంది ఉన్నారో…!?

Tollywood Actors :సినీ మాయ ప్రపంచంలో ఎన్నో వింతలూ ఉంటాయి. ఎన్నో జరుగుతాయి…వాటిని తట్టుకొని నిలబడాలి. సినిమా ప్రపంచం అన్నాక అన్నీ ఉంటాయి. రాణించాలంటే, ప్రతిభ ఉండాలి. అన్నింటికీ మించి అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటె పాత్రలు వెతుక్కుంటూ వస్తాయి. మనం ఎలా ఉన్నా మనల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తారు.

అలాగే కొంతమంది వివిధ కారణాల వలన ప్రమాదానికి గురైనప్పటికీ వాళ్లకు సినిమాల్లో ఛాన్స్ లు ఆగలేదు. అందులో కొందరిని ప్రస్తావిస్తే, నూటొక్క జిల్లాలకు అందగాడిని అని చెప్పే నూతన్ ప్రసాద్ ఉంటాడు. బాపు తీసిన అందాల రాముడు సినిమా తో నటుడుగా ఎంట్రీ ఇచ్చిన నూతన ప్రసాద్ విలన్ గా చేస్తూనే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు.

అలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘బామ్మ మాట బంగారు బాట’ మూవీ షూటింగ్ లో కారు పైనుంచి కింద పడే ఒక షార్ట్ తీసే సమయంలో ఆ కారుకు తాడు కట్టి పైకి లేపారు. అనుకోకుండా తాళ్లు తెగి కారు కింద పడడంతో రాజేంద్ర ప్రసాద్ తప్పించుకున్నాడు. అయితే అందులోనే ఉన్న నూతన ప్రసాద్ కి మాత్రం దెబ్బలు తగిలి తర్వాత అతని కాళ్లు పనికిరాకుండా పోయాయి.

అలా తుదికంటూ వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. అయితే నూతన్ ప్రసాద్ ని దృష్టిలో ఉంచుకుని రైటర్స్ కథలు రాయడంతో పలు సినిమాల్లో నటించి నటుడిగా అందరి మదిలో నిలిచాడు. ఈ చదువులు మాకొద్దు చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విద్యాసాగర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే జంధ్యాల తీసిన చాలా సినిమాల్లో నటించడంతో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించాడు.

అయితే సడన్ గా అతడికి పక్షవాతం రావడంతో ఒక కాలు, ఒకచేయి పనిచేయకుండా పోవడంతో వీల్ చైర్ కి పరిమితమై నాటకాలను డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా ఆయన భార్య రత్న కూడా యాక్టర్ కావడంతో సాయపడుతూ జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె చాలా సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

అలాగే స్వతహాగా మంచి అందగత్తె అయిన హీరోయిన్ అను అగర్వాల్ ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఇక ఆషికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకి మంచి క్రేజ్ తో పాటు యూత్ లో ఫాలోయింగ్ వచ్చింది. మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాలో ఒక మంచి పాత్ర వేసి, మంచి గుర్తింపు సాధించింది. అయితే అనుకోకుండా జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆమె 20 రోజుల పాటు కోమాలో ఉండిపోయింది.

బ్రతకదు అనుకున్న సమయంలో డాక్టర్లు శాయశక్తులా కృషి చేసి బ్రతికించారు. ఆమె బాడీ లో చాలా పార్ట్స్ కి రాడ్లు వేసే ఉంటాయి. అలాంటి అను అగర్వాల్ అప్పుడున్న అందాన్ని కోల్పోవడంతో ఆమెకు సినిమాల్లో ఛాన్స్ లు రాకపోవడంతో . బీహార్లో ఉన్న ఒక యోగ కేంద్రంలో యోగ నేర్చుకుని ప్రస్తుతం పవర్ లిఫ్టర్ గా చేస్తోంది. ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే సినిమాలు చేయడానికి రెడీ గా ఉంది.