Healthhealth tips in telugu

Belly fat After Pregnancy:ప్ర‌స‌వం త‌ర్వాత పొట్ట కొవ్వు త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్స్ మీ కోసం?

Belly fat After Pregnancy: అమ్మ తనం అనేది ఎంత అద్భుతమైన వరమో మాటల్లో చెప్పలేని అనుభూతి. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ మాతృత్వం పొందాల‌ని కోరుకుంటుంది.ఇక గ‌ర్భం దాల్చిన త‌ర్వాత ఎక్కువ ఆహారం తీసుకున్నా తీసుకోక‌పోయినా బ‌రువు పెర‌గ‌డం అనేది సహజంగా జరుగుతుంది. అయితే ప్ర‌స‌వం త‌ర్వాత శ‌రీరమంతా స‌న్న‌బ‌డినా పొట్ట భాగంలో మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా క‌నిపిస్తుంది.

ఇక ఆ కొవ్వును క‌రిగించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే పొట్ట కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. ప్రసవం అయిన తర్వాత స్త్రీలో చాలా మార్పులు జరుగుతాయి. వాటిలో ముఖ్యంగా పొట్ట భాగం గురించి చెప్పుకోవాలి. పిల్లలు పుట్టక ముందు ఏ మాత్రం పొట్ట లేకపోయిన,బిడ్డ పుట్టిన తర్వాత పొట్ట బాగా పెరిగిపోతుంది.

కొందరిలో ప్రసవం అయిన వెంటనే పొట్ట తగ్గిపోతుంది. మరికొందరికి ప్రసవం అయిన అసలు పొట్ట తగ్గదు.బిడ్డకు పాలు ఇచ్చే తల్లుల్లో ఈ సమస్య తక్కువగా కనపడుతుంది. అందువలన బిడ్డకు మూడు నెలలు వచ్చే వరకు తల్లి పాలు ఇవ్వటం మంచిది. ఇది బిడ్డ ఆరోగ్యానికి,తల్లికి కూడా మంచిది. తల్లి పాలు ఇవ్వటం వలన అధిక బరువు సమస్యలు,పొట్ట రెండు తగ్గిపోతాయి.

గర్బంతో ఉన్నప్పుడు తల్లి ఎంత పోషకాహారం తీసుకుంటుందో,ప్రసవం అనంతరం కూడా అంతే ఆహారం తీసుకోవాలి. దీని వలన కూడా పొట్ట తగ్గించుకొనే అవకాశం ఉంది. బెల్ట్ పెట్టుకోవటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెప్పుతున్నారు. అయితే ఈ బెల్ట్ వాడాలన్న బిడ్డకు మూడు నెలలు వచ్చే వరకు ఆగాలి.

ప్రసవం అయిన తర్వాత ఎంత తొందరగా నడవటం మొదలు పెడితే అంత మంచిది. రోజులో కనీసం అరగంట నడవాలి. అయితే రన్నింగ్,జాగింగ్ వంటివి చేసేటప్పుడు మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

కార్డియో వ్యాయామాలు రోజులో కనీసం 20 నిముషాలు చేయాలి. అలాగే పెల్విక్ వ్యాయామాలు చేయటం కూడా తప్పనిసరి. ఈ వ్యాయామాలు రోజులో వీలైనన్ని సార్లు చేస్తే మంచిది. జిమ్ కి వెళ్ళాలంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: Diabetes Care : షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పాటిస్తున్నారా…?

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News