Healthhealth tips in telugu

Matcha Tea: జపాన్‌లో ఫేమస్ అయినా మచా టీ ఎప్పుడైనా తాగారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…?

Matcha Tea benefits in Telugu: జపాన్‌లో ఫేమస్ అయినా మచా టీ ని ఎప్పుడైనా తాగారా…ఈ టీ లో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. మచా టీ అంటే ఒక రకమైన గ్రీన్ టీ. ఆకుపచ్చ రంగులో మంచి వాసనతో ప్రత్యేకమైన పోషక విలువలు ఉండుట వలన బాగా ప్రాచుర్యం పొందింది.

మచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేసి సెల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడి దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ టీ లో కొంచెం కెఫీన్ ఉంటుంది. కాఫీ తో పోలిస్తే ఇది స్థిరమైన శక్తి బూస్టర్ గా చెప్పవచ్చు. ఇందులో ఎల్-థియనైన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉండుట వలన శరీరానికి విశ్రాంతినిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మరియు బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మాచా టీ జీవక్రియ రేటును పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఇది కేలరీలను బర్న్ చేయడానికి శరీరానికి సహాయపడి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది.

మచా టీ ఒత్తిడి మరియు ఆందోళన లేకుండా మనస్సును ప్రశాంతపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఎముకలు పెళుసుగా లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మచా టీని తగిన మోతాదులో తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.

చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. ఈ టీలో విటమిన్ K మరియు లుటీన్‌ సమృద్దిగా ఉండుట వలన మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. అయితే మచా టీని పరగడుపున తాగకూడదు.ఒకవేళ తాగితే కడుపుకి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Hair Fall Reduce Tips:గంజిలో కలిపి జుట్టుకి పట్టిస్తే జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటం ఖాయం

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News