Weight Loss Tips:బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా…అయితే ఈ డ్రింక్ తాగండి
Weight loss Drink:ఉదయం సమయంలో తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది. బరువు తగ్గటానికి డ్రింక్స్ ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే మంచి పలితాన్ని అందిస్తాయి. ఇప్పుడు చెప్పే డ్రింక్ బరువు తగ్గటానికి సహాయపడటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. అలా కాఫీ లేదా టీ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అయితే కొంత మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టేవారు ఉదయం కాఫీ లేదా టీ లకు బదులుగా వేడి నీరు లేదా లెమన్ water వంటివి తాగుతూ ఉంటారు.
అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్యలలో అధిక బరువు సమస్య ఒకటి. అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా అవి పెద్దగా ఫలితాలను ఇవ్వక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటివారు ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది.
అయితే ఈ డ్రింక్ తీసుకుంటూ ప్రతిరోజు అరగంట వ్యాయామం కచ్చితంగా చేయాలి. అప్పుడే మనం బరువు తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. రాత్రి సమయంలో ఒక బౌల్ లో ఐదు బాదం పప్పులు వేసి నీటిని పోసి నానబెట్టాలి. మరొక బౌల్ లో చిటికెడు కుంకుమపువ్వు వేసి కొంచెం నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయం నానిన బాదంపప్పులను పై తొక్క తీసేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడి అయ్యాక అర స్పూన్ యాలకుల పొడి., అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర స్పూన్ అల్లం తురుము వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి. .
ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న కుంకుమపువ్వును నీటితో సహా వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నీటిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంపప్పును వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి తాగాలి. .
అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. ఉదయం సమయంలో ఈ డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. శరీరంలో వర్గాలన్నీ బయటికి పోతాయి. అలాగే హార్మోన్స్ సమస్య ఏమైనా ఉన్న అది కూడా సెట్ అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మనలో చాలామంది ఉదయం సమయంలో అలసట, నీరసం, ఒత్తిడిగా ఉంటూ ఉంటారు. అలాంటివారికి కూడా ఈ డ్రింక్ మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఉదయం సమయంలో తాగితే అలసట., నీరసం,నిస్సత్తువ ఏమీ లేకుండా రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు. ఈ డ్రింక్ ఉదయం సమయంలో తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమై సీజనల్ గా వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News