Healthhealth tips in telugu

Health Facts:మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేస్తున్నారు…ఒంటి గంట దాటుతుందా…ఈ నిజం తెలుసుకోండి

Health Facts: ఈమధ్య మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి శ్రద్ధ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే మధ్యాహ్నం భోజనం ఏ సమయంలో చేస్తే మంచిది.. అనే విషయం గురించి మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు.

మధ్యాహ్న భోజన సమయం కూడా మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మధ్యాహ్న భోజన సమయం లేట్ అయితే కొన్ని సమస్యలు వస్తాయి.అసలు మధ్యాహ్నం భోజనం ఏ సమయంలో తింటే మంచిది అనే విషయానికి వచ్చేసరికి…భోజనం మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:00 లోపు తింటే మంచిది.

మధ్యాహ్నం భోజనం ఒంటిగంట దాటితే కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు గురించి తెలుసుకుందాం. సరైన సమయానికి భోజనం చేయకపోతే తలనొప్పి వస్తుంది. ఇది దాదాపుగా అందరికి అనుభవమే. ఆకలి కారణంగా తలనొప్పి వస్తుంది.

భోజనం లేట్ గా చేయడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు తగ్గి తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి కారణంగా చికాకు కూడా వస్తుంది. కడుపులో గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది.ఆ తర్వాత అది కడుపులో నొప్పికి దారి తీస్తుంది. అనేక ఇతర జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి సరైన సమయంలో భోజనం చేయటం అలవాటుగా చేసుకోవాలి. జీవనశైలి బాగుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:00 లోపు తినటానికి ప్రయత్నం చేయాలి.

ఇది కూడా చదవండి: Sleep: నిద్ర సరిగా పోవడం లేదా..? అయితే ఈ ప్రమాదకరమైన సమస్యలు రావటం ఖాయం

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News