Sprouted Fenugreek Benefits : మెులకెత్తిన మెంతి గింజలు.. తింటే ఎన్నో ప్రయోజనాలు
Sprouted Fenugreek Benefits : రుచిలో చేదుగా ఉండే మెంతులు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మెంతులలో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే మొలకెత్తిన మెంతులను తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
రాత్రి సమయంలో ఒక బౌల్ లో మూడు స్పూన్ల మెంతులను వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెంతులలో నీటిని తీసేసి ఒక క్లాత్ లో వేసి మూట కట్టాలి. మరుసటి రోజు ఉదయం మొలకలు రావటం ప్రారంభం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా మొలకలు తయారవుతాయి. ఈ మొలకలను గాలి చొరబడని డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెడితే 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
మెంతి మొలకలు కాస్త చేదు తక్కువగా ఉంటాయి. వీటిని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రణలో ఉంటాయి. మొలకెత్తిన మెంతులలో ఉండే అమైనో ఆమ్లాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఉదయం సమయంలో పరగడుపున ఒక స్పూన్ మొలకెత్తిన మెంతులను తింటే వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి..ఆకలిని నియంత్రించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
మొలకెత్తిన మెంతులలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News