MoviesTollywood news in telugu

Tollywood:తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళే..ఎవరో చూడండి

Top character artists: టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోలుగా చేసినవారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎవరు ఉన్నారో చూద్దాం.

మొదట్లో జగపతిబాబు హీరోగా సినిమాలు చేశారు. తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశారు. అయితే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా చేస్తున్నాడు. హీరోగా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నాడు.

రాజేంద్రప్రసాద్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. తన కామెడితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు తండ్రి పాత్రలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.

శ్రీకాంత్ మొదట్లో విలన్ గా నటించినా ఆ తర్వాత హీరోగా ఎన్నో సినిమాలను చేసాడు. ఇక ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలను చేస్తున్నాడు.

నరేష్ కూడా హీరోగా మరియు కామెడి చేస్తూ మంచి పేరును సంపాదించాడు. నరేష్ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లో నటిస్తూ మంచి పేరుని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు.

శ్రీకాంత్ అయ్యంగర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.