Nagarjuna:కెరీర్ మొదట్లో నాగార్జునను అందంగా చూపించటానికి దర్శకులు ఎన్ని పాట్లు పడ్డారో తెలుసా?
Akkineni Nagarjuna:అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సాగాడు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. నాగార్జున వారసులుగా నాగ చైతన్య,అఖిల్ ఇద్దరూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.
మనిషికి ఏదో ఓ లోపం లేకుండా ఉండదు. భగవంతుడు అన్నీ ఇచ్చినా ఏదో ఒక తేడా చూపిస్తాడు. అందుకే ఉన్నదానికన్నా, లేనిదానికోసం పడే తాపత్రయం, ఆరాటం ఎక్కువ. ముఖ్యంగా హీరోలు తమ రేంజ్ పెంచుకోడానికి ఎన్ని రకాల టెక్నీక్స్ వాడతారో చెప్పలేం. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఇలాంటివి తప్పవు మరి.
ఇప్పుడైతే నాగార్జున స్మార్ట్ గా కనిపిస్తూ చార్మింగ్ హీరోగా వెలిగిపోతూ కనిపిస్తున్నాడు గానీ ఒకసారి గతంలోకి వెళ్తే స్మార్ట్ నెస్ కోసం పడ్డ శ్రమ వర్ణించలేం. ఒకప్పుడు బక్క పలచగా వుండే నాగ్ ,హీరోగా అస్సలు ఆనేవాడు కాదు. పైగా ఆ రోజుల్లో హీరోలు దిట్టంగా ఉండేవాళ్ళు కదా. కనీసం మీడియం రేంజ్ లోనైనా ఉండాలి. లేకుంటే కష్టమే. మొదట్లో ఎలాగోలా తొలి సినిమా విక్రమ్ మూవీ తీసేశారనుకోండి. అది కూడా హిట్ కొట్టేసింది.
అయితే అక్కినేని నాగేశ్వరరావు అందంతో పోలుస్తూ రాయడం వలన మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇక ఎలాంటి వల్లనైనా పద్దతిగా శిల్పంగా మల్చగల దిట్ట అయిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలను కూడా హ్యాండ్సమ్ గా చెక్కేవాడు. అందులో నాగ్ కూడా వున్నాడు. ఎందుకంటే ఆయన కాంబినేషన్ లో ఆఖరి పోరాటం సినిమా స్టార్ట్ చేసారు.
దీంతో కాస్త ఒళ్ళు పెంచుకుంటే ఇంకా అందంగా ఉంటావ్ అందుకే కాస్త వొళ్ళు పెంచుకో అంటూ నాగ్ కి రాఘవేంద్రరావు సలహా ఇచ్చాడు. అయితే సినిమా టైం కి నాగ్ అందుకు తగ్గట్టు ఎచీవ్ కాలేకపోయాడు.దీంతో ఫాంట్స్ లో షర్ట్స్ స్పాంజ్ లు కుక్కి మరీ బట్టలు కుట్టించేసారు రాఘవేంద్రరావు. ఇక అవి వేసుకుని నాగ్ నానా అగచాట్లు పడుతుంటే, లేదు లేదు వేసుకోవాల్సిందే అని దర్శకేంద్రుడు స్పష్టం చేసారు.
మిగిలిన సమయంలో కాకపోయినా కనీసం సాంగ్స్ కైనా వేసుకోక తప్పదని రాఘవేంద్రరావు తేల్చి చెప్పేసారు. ఇక అవి వేసుకుని ఎండల్లో డాన్సులు చేస్తుంటే నా సామి రంగా అన్నట్టుండేది నాగ్ కి. పోనీ వద్దని చెప్పేద్దామంటే,పెద్దయానికి చెప్పే సాహసం చేయలేక ఎడ్జెస్ట్ అయ్యాడు నాగ్ అందులోని సాంగ్స్ వరకూ.
ఇక ఆ తర్వాత జానకీరాముడు షూటింగ్ వచ్చేసింది. ఆ సినిమాలో పల్లెటూరి కుర్రాడిగా అందంగా బొద్దుగా ఉండాలి కనుక జుబ్బాలన్నింటికే రెండంచుల స్పాంజ్ లు వేసి కొట్టండి అంటూ నాగ్ లావుగా కనిపించడానికి దగ్గరుండి మరీ కుట్టించారు రాఘవేంద్రరావు. ఇక రాఘవేంద్రరావు కి ఎదురు చెప్పే ధైర్యం చేయలేక ఆ బట్టలు వేసుకుని గోదావరి ఎండల్లో నరకం అనుభవించారు నాగ్. ఆ సినిమాతో నాగ్ కి గ్లామర్ కూడా పెరిగిందనుకోండి. ఇలాంటి పాడింగ్స్ హీరోయిన్స్ కే కాదు హీరోలకు కూడా వాడేవారు ఆరోజుల్లో. అదండీ నాగార్జున గ్లామర్ సంగతి.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/