Healthhealth tips in telugu

Benefits Of Rajma:వారంలో రెండు సార్లు రాజ్మా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Benefits Of Rajma: ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగింది. దాంతో మంచి పోషకాలు ఉన్న ఆహారం తినటానికి ఇష్టపడుతున్నారు. అలాగే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఎన్నో రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి.

రాజ్మా లేదా కిడ్నీ బీన్స్‌ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాజ్మాలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. మాంసాహారం తినలేని వారికి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రాజ్మాలో విటమిన్ బి., విటమిన్ కే, విటమిన్ ఈ, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి.

రాజ్మాను లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మోతాదుకి మించి తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజ్మా తీసుకొనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా రాజ్మాకి దూరంగా ఉంటేనే మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.

మలబద్దకం సమస్యతో బాధపడేవారు రాజ్మాకు దూరంగా ఉంటేనే మంచిది. కిడ్నీ బీన్స్ తిన్న తర్వాత, అది జీర్ణం కావడానికి శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. మీరు తక్కువ నీరు త్రాగితే అది మలబద్ధకం సమస్యగా మారుతుంది. కాబట్టి రాజ్మా తిన్నప్పుడు నీటిని ఎక్కువగా తాగటానికి ప్రయత్నం చేయండి. శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉన్న వారు రాజ్మాను లిమిట్ గా తీసుకోవాలి.

ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ఐరన్ స్థాయిలు పెరిగి కొన్ని సమస్యలకు కారణం అవుతుంది. గర్భధారణ సమయంలో రాజ్మా తీసుకోవడం వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ప్రయోజనం కనపడుతుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. తక్కవు బరువు ఉన్నవారు కూడా కిడ్నీ బీన్స్‌ను మితంగా తినాలి.

ఎందుకంటే ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పొట్ట నిండినట్లుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. దాంతో బరువు పెరగటం కష్టం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా చాలా లిమిట్ గా తీసుకోవాలి. కాబట్టి రాజ్మాను లిమిట్ గా తీసుకోని వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News