Beauty Tips

Skin Whitening Remedies:ముఖాన్ని కాంతివంతంగా మార్చటంలో శనగపిండి ఎంత మాయ చేస్తుందో…అసలు నమ్మలేరు

Skin Whitening Remedies:ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగుతూ సమయాన్ని వృదా సుహస్తు ఉంటారు. మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

ప్రతి రోజు మనం ఉపయోగించే ఆహారాలలో పెరుగు ఒకటి. పెరుగును రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. పెరుగులో సమృద్ధిగా ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. పెరుగులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలుసు. పెరుగు సౌందర్య పోషణలో కూడా బాగా హెల్ప్ అవుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చటంలో పెరుగు బాగా సహాయపడుతుంది.

పెరుగులో ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మాన్ని పొడిగా మరియు నిస్తేజంగా కాకుండా తేలికగా మరియు మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మంపై గీతలు, ముడతలు, రంద్రాలని తొలగించటంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే రిబోఫ్లేవిన్ చర్మాన్ని ప్రకాశవంతంగా ,హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. కణాల పెరుగుదల మరియు పునరుత్పత్తికి సహాయపడుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు, అరస్పూన్ తేనే,అరస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడ‌కు బాగా రాసి అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు తొలగిపోవటంతో పాటు ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై మృత కణాలు కూడా తొలగిపోతాయి.

చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ వారానికోసారి వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా తయారవడంతో పాటు మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.

టేబుల్ స్పూన్ పెరుగులో పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. పసుపులో ఉన్న యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలు రాకుండా కాపాడటంతో పాటు.. పసుపు మేనిఛాయను సైతం పెంచుతాయి. వారానికోసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/