Diabetes diet:చలికాలంలో షుగర్ ఉన్నవారికి సూపర్ డైట్ ప్లాన్
Diabetes diet: డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ వచ్చినప్పుడు చాలా కంగారు పడుతూ ఉంటారు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాన్ని తీసుకుంటూ మందులు వాడితే సరిపోతుంది.
అలాగే ప్రతి నెల డయాబెటిస్ ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య . ఈ సమస్యకు మారిన జీవన శైలి సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వ్యాయామం చేయకపోవటం అలాగే వంశపారంపర్యంగా వస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చూసుకోవాలి అయితే ఎటువంటి డైట్ తీసుకుంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.
చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు అంటే పియర్ పండు ఆపిల్ పండు బాదం పప్పు పాలు ఉడికించిన గుడ్డు వంటివి తీసుకోవచ్చు.
అదే మధ్యాహ్నం అయితే చపాతి బ్రౌన్ రైస్ లతోపాటు ఆకుకూరలు తీసుకోవాలి. చలికాలంలో ఆకుకూరల్లో కూడా బాగా లభ్యమవుతాయి ముఖ్యంగా పాలకూర తోటకూర బచ్చలి కూర మెంతికూర వంటి ఆకుకూరలు క్యారెట్,బీన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి.
అదే రాత్రి సమయంలో ఓట్స్ చపాతీ పుల్కా వంటి తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి.పెరుగు అస్సలు తీసుకోకూడదు. మజ్జిగ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా అయిలీ ఫుడ్ తీసుకోకూడదు వారంలో రెండుసార్లు మాత్రమే చేపలు తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News