Healthhealth tips in telugu

Ayurvedic cough syrup:ఈ కాషాయం తాగితే ఈ సీజన్ లో వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పులకు చెక్

Ayurvedic cough syrup: సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మన వంటింటిలో ఉండే వస్తువులను ఉపయోగించి ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చలికాలంలో దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి రావటం ప్రారంభం కాగానే ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

రోగనిరోదక శక్తి బలంగా ఉంటే ఎటువంటి సమస్యలు రావు. ఈ చిట్కా కోసం అల్లం తీసుకొని పై తొక్క తీసేసి తురమాలి. ఒక బౌల్ లో 1 స్పూన్ తురిమిన అల్లం, 2 స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం,తేనె రెండింటిలోను ఉన్న లక్షణాలు ఉపశమనం కలిగించటానికి సహాయపడతాయి.

అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే విటమిన్ సి,మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లేమేటరీ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి. దాంతో జలుబు,దగ్గు వంటివి తగ్గుతాయి.

తేనెను ఆయుర్వేదంలోనూ విరివిరిగా వాడారు. ఈ తేనెలో విటమిన్ సి, విటమిన్ బీ6, ఫ్రక్టోస్, కార్బోహైడ్రేట్లు, రైబోఫ్లోవిన్, నియాసిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. తేనెలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తేనె మంచి యంటీబయాటిక్‌గా పని చేస్తుంది. దగ్గు సమస్యకు తేనె చెక్ పెడుతుంది. దగ్గుతో పాటు గొంతు సమస్యను నియంత్రిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News