Kitchenvantalu

Bottle gourd roti: అల్పాహారంలోకి సొరకాయ చపాతీ.. కర్రీ కూడా అక్కర్లేదు…

Bottle Gourd Chapati: ఒంటికి చలువ చేసే సొరకాయలతో, గారేలు చేసుకుంటాం. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసుకదా. అలాగే సొరకాయ చపాతీలు ట్రై చేసి ఉంటే, మెత్తగా భలే రుచిగా ఉంటాయి. పైగా హెల్తీ కూడా ఇంకెందుకు ఆలస్యం సొరకాయ చపాతి తయారీ విధానం తెల్సుకుందాం రండి.

కావాల్సిన పదార్దాలు
గోధుమపిండి – 2 ½ కప్స్
తురిమిన సొరకాయ – 2 కప్పులు
ఉప్పు – తగినంత
గరం మసాలా – 1/2 టీ స్పూన్
తరిగిన పచ్చిమిర్చి – 1/2 టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – 1/2 టీ స్పూన్
ఇంగువ – చిటికెడు
నూనె – తగినంత

తయారీ విధానం
1.ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమపిండి వేసి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
2. అందులోకి తురిమిన సొరకాయ పచ్చిమిర్చి, గరం మసాల, పెప్పర్ పౌడర్, ఇంగువ, 2 టేబుల్ స్పూన్ అయిల్, వేసుకుని, బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు కొంచం కొంచం నీరు కలుపుతూ, పిండిని మెత్తగా చపాతి పిండిలా చేసుకోవాలి.

4. కలుపుకున్న పండి ముద్దకి, నూనె రాసి, కాసేపు పక్కన పెట్టాలి.
5. 15 నిముషాల తర్వాత పిండిముద్దలను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పొడి పిండిని చల్లుతూ, మెల్లిగా, చపాతీ లాగా వత్తుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, ఒకోక్క చపాతిని రెండు వైపులా వేయించి, కొద్దిగా నూనె యాడ్ చేసుకుని, బాగా రోస్ట్ చేసుకోవాలి.
7. అంతే సొరకాయ చపాతీలు రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News