Kitchenvantalu

Coconut Halwa:ఇంట్లో కొబ్బరి మిగిలిపోతే ఇలా సాఫ్ట్ సూపర్ గా హల్వా చేయండి చాలా బాగుంటుంది

Coconut Halwa: పండగలు, పూజలు, బర్త్ డేలు,శుభకార్యాలు ఏవైనా ఆరోజు స్వీట్ తోనే మొదలు పెడతాం.స్వీట్స్ లో హల్వా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలో, ఎక్కువ రుచి నిచ్చే, కొబ్బరి హల్వా ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
పచ్చి కొబ్బరి – 2 కప్పులు
బెల్ల – 1 కప్పు
యాలకుల పొడి – 1/2టీ స్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పులు – 10

తయారీ విధానం
1.ముందుగా ఒక మిక్సీజార్ తీసుకుని, అందులోకి పచ్చికొబ్బరి, తురిమిన బెల్లం కలిపి ,కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.

2.ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకుని, జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.

3.ఇప్పుడు అదే పాన్ లోకి గ్రైండ్ చేసి పెట్టుకుని , కొబ్బరి, బెల్లం పేస్ట్ వేసుకుని, మీడియం ఫ్లేమ్ పై దగ్గర పడే వరకు ఉడికించాలి.

4.దాదాపుగా 20 నిముషాలు ఫ్రై చేసిన తర్వాత , హల్వా కంసిస్టెన్సీ లోకి వచ్చాక, అందులోకి యాలకుల పొడి, మరొక స్పూన్ నెయ్యి, వేయించి పెట్టుకున్న జీడి పప్పులు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

5.స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సెర్వ్ చేసుకుంటే వేడి వేడి కొబ్బరి హల్వా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News