Healthhealth tips in telugu

Onion Cutting:కోసిన ఉల్లిపాయను ఎక్కువ సేపు అలా ఉంచితే…ఏమి అవుతుందో…?

onion Cutting :ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఉల్లిపాయను కట్ చేసిన వెంటనే తినాలా..లేదంటే నిల్వ చేసి తినవచ్చా…అనే విషయంలో సందేహం ఉంటుంది.

ఉల్లిపాయను కట్ చేసిన వెంటనే తినాలి. ఉల్లిపాయలో ఉండే ఘాటైన వాసన కారణంగా, ఉల్లిపాయను సగానికి కోసి ఆలా ఉంచితే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. అందువల్ల కోసి ఆలా ఉంచిన ఉల్లిపాయలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి.

ఈ ఉల్లిపాయను తిన్నప్పుడు దానిలో ఉండే బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి కడుపునొప్పి మరియు ఇన్ఫెక్షన్స్ కి కారణం అవుతుంది. అయితే ఉల్లిపాయను కోసిన ఒకరోజు తర్వాత ఈ విధంగా జరుగుతుందట. అందువల్ల అవసరం అయినప్పుడు ఉల్లిపాయ కోసుకుంటే సరిపోతుంది.

కానీ మరొక వాదన కూడా ఉంది. కొంతమంది ఉల్లిపాయకు ఉన్న ఘాటైన వాసన కారణంగా త్వరగా బ్యాక్టీరియా చేరదని అంటారు. అయితే కోసే సమయంలోను,నిల్వ చేసే సమయంలోను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుందట. ఉల్లిపాయ మాత్రమే కాదు ఎటువంటి ఆహారాన్ని అయినా శుభ్రమైన వాతావరణంలో ఉంచాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News