Things To Avoid After 7 :రాత్రి 7 తర్వాత కొన్ని పనులను చేయకూడదని తెలుసా ?
Things To Avoid After 7: ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి ఇంటికి చేరుకునే వరకు తీరిక లేకుండా ఎంతో కష్టపడి అలసిపోయి ఇంటికి వస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికి తెలిసిన విషయమే.. కాని తప్పక కాలాన్ని అలా గడిపేస్తుంటారు. కాని రాత్రి 7 తరువాత చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!
చాలామంది ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఏం చేస్తారు? డ్రస్ కూడా మార్చకుండా ఆదరాబాదరాగా ఏదో ఒకటి తింటుంటారు. ఇది మంచిది కాదు. సాయంత్రం తీసుకునే స్నాక్స్ కేవలం మానసికాందం కోసం తప్ప.. ఆకలి తీర్చుకోవాడానికి కాదట..! అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిన తరువాత తక్కువ స్థాయిలో ఆహారం తీసుకుంటే మానసికంగా ఆహ్లాదంగా ఉంటుందట.
ఇక సాయంత్రం తాగే టీతో పాటు చాలామంది భారీగా స్నాక్స్ లాగించేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఉండేది జంక్ ఫుడ్. మరికొద్ది సెపట్లో రాత్రి భోజనం చేసే ముందు ఇటువంటి జంక్ ఫుడ్ తీసుకొవడం అనారొగ్యానికి దారి తీస్తుంది.
చాలా మంది సాయంత్రం సమయం నుంచి మంచి నీళ్ళు తక్కువగా తీసుకుంటుంటారు. పగటి సమయంలాగే రాత్రి వేళల్లో కూడా తగిన మోతాదులో నీళ్ళు తీసుకోవాలి.
ఇక పగలంతా అలిసిపోయి ఇంటికి వచ్చినవారు గంటల తరబడి టివి చూస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. టీవీ చూడొచ్చు గాని అదే పనిగా కాకుండా ఒక గంట చూస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఆ మిగతా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం, పుస్తకాలు చదవడం వంటివి చేస్తే మంచిదని అంటున్నారు.
చాలా మంది రాత్రి భోజనాన్ని భారీగా తీసుకుంటుంటారు. నిజానికి రోజు మొత్తం చేసే భోజనం లో బ్రేక్ ఫాస్ట్ కీలకం. రాత్రి భోజనానికి అంత ప్రాధాన్యత లేదు. అమితంగా ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అది కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలాగే భోజనం చెసిన వెంటనే నిద్రించడం మంచి పద్ధతి కాదు అంటున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News