Skin Glow Tips: పంచదారతో ఇలా చేస్తే ఎంతటి నల్లటి మచ్చలు ఉన్నా తొలగిపోయి తెల్లగా మెరిసిపోతారు
Sugar And Coffee Face Glow Tips: ముఖ సంరక్షణలో మన వంటింటిలో ఉన్న ఎన్నో వస్తువులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. మన వంటిల్లు ఔషదాల గని. ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ వస్తువులను ఉపయోగించి ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో ముఖం అందంగా తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా సిద్దంగా ఉంటారు. ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోయి ముఖంపై మలినాలు, డస్ట్ వంటివి పేరుకుపోవడం సర్వ సాధారణం అయ్యిపోయింది. ముఖాన్ని ఆలా వదిలేస్తే ముఖం నల్లగా,నిస్తేజంగా మారిపోతుంది.
ముఖం కాంతివంతంగా కన్పించాలన్నా, తాన్,నలుపు వంటివి తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ ముఖ చర్మం నల్లగా లేకుండా తెల్లగా,కాంతివంతంగా మారుస్తుంది. ఈ ప్యాక్ అడ, మగ ఎవరైనా ట్రై చేయవచ్చు. ఈ ప్యాక్ ఉపయోగించటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్యాక్ కి మూడు ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి. ఆ తర్వాత కాఫీ పొడి వేయాలి. కాఫీ పొడి సుమారుగా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ కలబంద జెల్ ని వేసి బాగా కలపాలి. ఈ మూడు పదార్ధాలు బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేయటానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించి సున్నితంగా 3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖం మీద పేరుకుపోయిన మలినాలు,మురికి,మృతకణాలు అన్ని తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది. ఈ ప్యాక్ లో ఉండే పోషకాలు చర్మ రంగు మీద ప్రభావం చూపి తెల్లగా మారుస్తాయి. ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఈ ప్యాక్ అడ, మగ ఎవరైనా ట్రై చేయవచ్చు. ఈ ప్యాక్ ఉపయోగించటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కలబందలో ఉండే విటమిన్ C,E, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని బాగా శుభ్రం చేసి మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. కలబంద జెల్ అయినా వాడవచ్చు. కాఫీ పొడి చర్మంలో రక్తప్రసరణను బాగా పెంచి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/