Healthhealth tips in telugu

Garlic under Pillow :వెల్లుల్లి రేకుల్ని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తున్నారా..ఈ విషయం తెలుసుకోండి

Garlic under Pillow :వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు వెల్లుల్లి తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్పుతున్నారు. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు వెల్లుల్లిలో ఉన్నాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు వెల్లుల్లిలో ఉన్నాయి.

ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉప‌యోగాలు వెల్లుల్లిని వాడ‌డం వల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా దానికి చెందిన మ‌రో ఉప‌యోగ‌మే. ఇక‌ ఇందులో విశేష‌మేమింటే వెల్లుల్లిని మీరు తినాల్సిన ప‌నిలేదు. అవును, దాన్ని తిన‌కుండానే, దాని వ‌ల్ల క‌లిగే లాభాల‌ను మీరు ఎంచ‌క్కా పొంద‌వ‌చ్చు. అదెలాగంటే…

ఒక వెల్లుల్లి రేకును తీసుకుని మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోండి. అంతే చాలు. దాంతో కింద చెప్పిన ఉప‌యోగాలు క‌లుగుతాయి.

1. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించ‌డం వ‌ల్ల అందులో ఉండే వేడి, అరోమా గుణాలు మెద‌డులోని ప‌లు ప్రాంతాల‌ను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. రోజూ దిండు కింద ఓ వెల్లుల్లి రేకుని పెట్టుకుని ప‌డుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వ‌స్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉండ‌దు.

2. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే చాలు.

3. గుండె సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయి. ర‌క్తం శుభ్ర‌మ‌వుతుంది.

4. లివ‌ర్ చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. అన్ని ర‌కాల లివ‌ర్ వ్యాధులు పోతాయి.

5. వెంట్రుక‌ల‌కు పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య తొల‌గిపోతుంది.

6. హార్మ‌న్ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీవ‌క్రియ‌లు స‌క్రమంగా జ‌రుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News