Kitchenvantalu

Mexican Rice:మెక్సికన్‌ రైస్​తో లంచ్.. తయారు చేయడం చాలా సింపుల్.. సూపర్ గా ఉంటుంది

Mexican Rice: స్పెషల్ రైల్ అనగానే, వెజ్ పలావ్, బగారా రైస్, చేసేస్తుంటాం. అప్పుడప్పుడు కాస్త కొత్తగా ట్రై చేయాలి అనుకునేవాళ్లు, కలర్ ఫుల్ మెక్సికన్ బీన్స్ రైస్ను ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
నూనె – 2 టేబుల్ స్పూన్స్
తరిగిన వెల్లుల్లి – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ -1
టమాటా పేస్ట్ – 3/4కప్పు
బాస్మతి రైస్ – 1/5కప్పు
ఉప్పు –తగినంత
కారం – 1 స్పూన్
ఒరిగానో- 3/4స్పూన్
జీలకర్ర పొడి – 1/2టీస్పూన్
పెప్పర్ పౌడర్ – 1/2టీస్పూన్
టమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్స్
పసుపు క్యాప్సికమ్ – 1/4కప్పు ( తురిమినవి)
రెడ్ క్యాప్సికమ్ – 1/4కప్పు ( తురిమినవి)
గ్రీన్ క్యాప్సికమ్ – 1/4కప్పు ( తురిమినవి)
స్వీట్ కార్న్ – 1/4కప్పు
గ్రీన్ పీస్ – 1/4కప్పు
జలపెనోస్ – 1/4కప్పు
నిమ్మరసం – సగం ముక్క
ఉడికించిన రాజ్ మా – 1/4కప్పు
స్పింగ్ ఆనియన్ – 2 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం

1.స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని , నూనె వేసి వేడెక్కనివ్వాలి.
2. వేడెక్కిన ఆయిల్ లోకి, తరిగిన వెల్లుల్లి వేసి 30 సెకండ్స్ పాటు వేయించుకుని, అందులోకి తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లోకి , టామాటో పేస్ట్, మరియు, మసాలా దినుసులు తగినంత ఉప్పు వేసి నూనె పైకి తేలేవరకు, ఫ్రై చేయాలి
4. తర్వాత అన్ని రకాల క్యాప్సికమ్ ముక్కలను వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి.
5. తర్వాత నాన పెట్టిన పచ్చి బటానీలు, నాన పెట్టుకున్న బాస్ మతి రైస్ను వేసి, మిక్స్ చేసి, మూడు నిముషాలు వేగనివ్వాలి.

6. ఇప్పుడు అందులోకి, ప్రోజెన్ కార్న్, గ్రీన్ పీస్, రాజ్ మా బీన్స్, టమాటో కెచప్ వేసి, 2.5 కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టుకుని, 50 శాతం వరకు, ఉడికేలా హై ఫ్లేమ్లో ఉడికించాలి.
7. 50 శాతం ఉడికిన అన్నంలోకి , జలపెనోస్ స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చి కొత్తిమిర, నిమ్మరసం వేసి, నెమ్మదిగా కలపాలి.
8. మీడియం ఫ్లేమ్ పై 5 నిముషాలు ఉడికించాలి.
9. చివరగా స్టవ్ ఆఫ్ చేసాక, 15 నిముషాలు సెర్వ్ చేసుకోవాలి.
10. అంతే యమ్మీ యమ్మీ కలర్ ఫుల్ మెక్సికన్‌ బీన్స్ రైస్..