Kitchenvantalu

Allam Perugu Pachadi: 5 నిమిషాల్లో నోరూరించే అల్లం పెరుగు పచ్చడి.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు

Allam Perugu Pachadi:మొదటి ముద్ద పచ్చడి తో మొదలెట్టి చివరి ముద్ద మజ్జిగతో ముగిస్తేనే భోజనం సంపూర్ణంగా అనిపిస్తుంది.చప్పని మజ్జికకి కాస్తా ఘాటు తగిలించి అల్లంతో పెరుగు పచ్చడి ట్రైచేయండి. అన్ని సీజన్స్ కి ఆల్ రౌండర్ లా పనిచేస్తుంది.

కావాల్సిన పధార్ధాలు
మెంతులు-1 టీ స్పూన్
కరివేపాకు-1 రెమ్మ
అల్లం- 2 ఇంచులు
పచ్చిమిర్చి-2
తురిమిన కొబ్బరి- 1 కప్పు
పసుపు-1/2 టీ స్పూన్
ఉప్పు –రుచికి సరిపడ
నూనె -2 టీ స్పూన్స్
ఆవాలు-1 టీ స్పూన్
మినపప్పు-1 టీ స్పూన్
ఎండు మిర్చి-1
ఇంగువ-చిటికెడు
జీలకర్ర-1/2 టీ స్పూన్
పెరుగు-1 కప్పు
కొత్తిమీర- కొద్దిగా

తయారి విధానం

1.ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులను వేసి దోరగా వేయించుకోవాలి.అందులోకి కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి పచ్చిదనం పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు ఒక మిక్సీజార్ లోకివేయించిన మెంతులు కరివేపాకు తోపాటుగా అల్లం ముక్కలను,పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి పసుపు తగినంత ఉప్పు వేసుకోని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోని అందులోకి ఆవాలు ,జీలకర్ర,మినపప్పు ,ఎండుమిర్చివేసి పోపు వేగాక గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ను తాలింపులోకి ఆడ్ చేసుకోవాలి.

4.అల్లం పేస్ట్ ని రెండు నిమిషాలపాటు బాగా కలుపుకోవాలి.
5.ఇప్పుడు మజ్జిగ కోసం కొద్దిగా నీళ్లు కలుపుతు పెరుగును బీట్ చేసుకోని మెత్తని క్రీమ్ లా తయారు చేసుకోని తాలింపు వేసుకున్న అల్లం ముద్దను పెరుగులో వేసుకోని బాగా కలుపుకోవాలి.
6.ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీరను చల్లుకోని అన్నంలోకి సర్వ్ చేసారంటే రుచి అదిరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News