Brain Food:ఈ ఆహారాలు మెదడును మరింత చురుకుగా చేస్తాయి.. తప్పకుండా తినండి..
Brain Food: మెదడు బాగా పనిచేస్తేనే మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్ని పనులను అయినా చాలా ఉత్సాహంగా చురుకుగా చేస్తాం. మెదడు సరిగ్గా పని చేయకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కొన్ని ఆహారాలను తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ఒకప్పుడు 60,70 ఏళ్ళు వచ్చేసరికి జ్ఞాపకశక్తి సమస్య వచ్చేది. ఇప్పుడు మారిన జీవన శైలి మారిన కాలాన్ని బట్టి చాలా చిన్న వయసులోనే అంటే 30,40 ఏళ్లు వచ్చేసరికి జ్ఞాపకశక్తి సమస్య వస్తోంది. మెదడు పనితీరు తగ్గి జ్ఞాపక శక్తి లోపిస్తుంది జ్ఞాపకశక్తి సరిగా లేకపోతే ఆలోచనా శక్తి తగ్గిపోవడం అలాగే చేసే పనిమీద ఏకాగ్రత ఉండకపోవటం వంటివి ఏర్పడతాయి.
అందుకే మెదడు చురుగ్గా ఉంటే ఇటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి మెదడు చురుగ్గా పని చేసేలా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పసుపు మెదడు చురుగ్గా పనిచేసేలా చేయడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రతి రోజు పాలు, పెరుగు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. అరటి పండ్లు, స్ట్రాబెర్రీ వంటి పళ్ళ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. అలాగే మెదడు చురుగ్గా పని చేయాలంటే డార్క్ చాక్లెట్ కూడా డైట్ లో చేర్చుకోవాలి.
అలాగే ఆకుకూరలు కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటివి తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News