Healthhealth tips in telugu

Guava: ఈ సీజన్ లో రోజుకో జామపండు తింటే.. ఇన్ని ఉపయోగాలా!!

Guava Fruit Benefits:చలికాలం ప్రారంభం అయిపోయింది. ఈ చలి కాలంలో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వానలు కూడా వస్తున్నాయి. సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఆ సీజన్ లో దొరికే పండ్లను తీసుకోవాలి.

ముఖ్యంగా చలి కారణంగా రొంప, దగ్గు, గొంతు నొప్పి, న్యూమోనియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చలికాలం ప్రారంభం కాగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మన పెద్దవారు చలికాలంలో జామకాయ తినవద్దు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే జామకాయ తింటే జలుబు చేస్తుంది అని చెబుతూ ఉంటారు.

కానీ దానిలో వాస్తవం లేదు. ఎందుకంటే జామకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలో కన్నా జామకాయ లోనే విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వలన జామ కాయ తింటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడి జలుబు, గొంతు నొప్పి వంటివి రావు.

అలాగే డయాబెటిస్ తో బాధపడేవారికి జామకాయలో ఉండే పీచు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. జామకాయలో ఉండే కాపర్ థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రోజుకు ఒక జామ కాయ తింటే చాలా మంచిది.

మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. ప్రతి రోజు సాయంత్రం సమయంలో ఒక జామకాయ తింటే సరిపోతుంది. చాలా చవకగా చాలా విరివిగా లభ్యం అయ్యే జామకాయను తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News