Kitchenvantalu

Beerakaya Palleela Kura Recipe:ఎప్పుడు చేసేలా కాకుండా బీరకాయ కర్రీ ఇలా చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది

Beerakaya Palleela Kura Recipe: ఎంతో ఆరోగ్యకరమైన బీరకాయను, ఎప్పుడు ఆప్షన్ గానే ఉండుతుంటారు. చప్పటి కూరలా పేరు పోయిన, బీరకాయకు కాసిన్ని పల్లీలు యాడ్ చేసి, కూర చేసుకుంటే, ఇది బీరకాయ కర్రీనేనా అని ఆశ్చర్యపోతారు.

కావాల్సిన పదార్ధాలు
పల్లీలు – 1/4కప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు – 1/4కప్పు
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
ఎండు మిర్చి – 2
పసుపు – 1/4టీస్పూన్
ఇంగువ – చిటికెడు
ధనియాల పొడి – 2 టీ స్పూన్స్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
బీరకాయ ముక్కలు -1/2కేజీ
నీళ్లు – 150 ml
కొత్తిమీర – కొద్దిగా,

తయారీ విధానం
1.ముందుగా మిక్సీ జార్ లోకి, వేపిన పల్లీలను, పచ్చి కొబ్బరిని తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, అందులోకి ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి, తాళింపు పెట్టుకోవాలి.
3. అందులోకి ఉల్లిపాయ తరుగు వేసి మెత్తపడే వరకు వేగనివ్వాలి.

4. వేగిన ఉల్లిపాయల్లోకి, ధనియాల పొడి, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసి, నూనె పైకి తేలేవరకు వేపు కోవాలి.
5. ఇప్పుడు అందులోకి బీయకాయ ముక్కలు వేసి, రెండు మూడు నిముషాలు మగ్గనివ్వాలి.
6. మగ్గిన బీరకాయ ముక్కల్లోకి, పల్లీలు, కొబ్బరి పేస్ట్ వేసి, కొన్ని నీళ్లు యాడ్ చేసుకుని, కలిపి నీళ్లు పెట్టుకుని, స్టవ్ పై మూత పెట్టి, సిమ్ లో 8 నుంచి 10 ఉడకనివ్వాలి.
7. చివరగా 10 నిముషాల తర్వాత కొత్తిమీర చల్లుకుని, స్టవ్ ఆఫ్ చేసుకుంటే, కమ్మటి బీరయార పల్లి కూర రెడీ అయినట్లే..