Tamarind Seeds : మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. చింతగింజలతో ఇలా చేస్తే ఎంతో ఉపశమనం
Tamarind Seeds : ఒకప్పుడు వయస్సు పెరిగాక వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు రావటానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అయినా వారికి ఆ నొప్పులు తగ్గడం లేదు. అయితే.. ఎన్ని మందులు వేసుకున్నా.. తగ్గని మోకాళ్ళ నొప్పులు మనం చింతకాయలు, చింతపండు తిని పారేసే చింత గింజలతో తగ్గుతుందని నిరూపితం అయింది.
ఆయుర్వేద నిపుణులు సైతం ఈ వైద్యాన్ని అంగీకరిస్తున్నారు. చింతకాయలు, చింతపండు తిన్నాక వచ్చే.. చింతగింజలను ఉపయోగించి మోకాళ్ల నొప్పికి మంచి ఔషదం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.
1: చింతగింజల వేయించాలి.
2: బాగా వేగిన చింతగింజలను 2 రోజుల పాటు నీటిలో నానబెట్టాలి.
3: నీటిని మారుస్తూ 2 రోజులు నానిన తర్వాత వాటి పొట్టు త్వరగా వస్తుంది.
4: పొట్టును తీసి.. చింతగింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి.
5: ఎండిన తర్వాత ఆ చింతగింజలను మిక్సీ లో వేసి పొడిలాగా తయారు చేసుకోవాలి.
6: ఆ పొడిని ప్రతి రోజూ ఒక్కో స్పూన్ చొప్పున రెండు సార్లు నీటిలో లేదా పాలల్లో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల 30 రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుండి శాస్వత పరిష్కారం దొరుకుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News