Healthhealth tips in telugu

Weight Loss:సోంపు వాటర్ ని ఇలా తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది..

Weight Loss drink: మనం భోజనం చేసిన తర్వాత నోట్లో వేసుకొని నమిలే సోంపులో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. సోంపు ఇంట్లో ఉండే ఔషది ఉన్నట్టే అని ఆయుర్వేదం చెబుతోంది. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సోంపు అద్భుతంగా పనిచేస్తుంది.

ఒక స్పూన్ సోంపుగింజలను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే పరగడపున తాగాలి. సోంపూ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది బాడీలో మెటబాలిజం రేట్ పెంచుతుంది.

దీంతో జీర్ణం త్వరగా అయిపోయి క్యాలరీలు శక్తిగా మారతాయి. పొట్టు చుట్టూతా ఉన్న కొవ్వు కరిగిపోయి శరీరం నాజూగ్గా తయారవుతుంది. సోంపు తిన్న ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. టాక్సిన్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది.

సోంపు ఒక సహజ డిటాక్సిఫైయర్. అందువల్ల భోజనం చేసిన వెంటనే దీనిని తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరం నుంచి అనేక టాక్సిన్‌లను తొలగిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా జరిగేలా చూస్తోంది.

సోంపు నీటిని తాగడం వలన శరీరంలో ఉండే అదనపు నీటిని తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో ఉన్న అదనపు నీటిని శరీరంలో నిల్వ లేకుండా చేయడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News