Dark Circles:కొబ్బరి నూనెతో ఇలాచేస్తే 5 నిమిషాల్లో కళ్ళ కింద మచ్చలు మాయం
Dark Circles Home Remedies in telugu:కొబ్బరి నూనె ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. చర్మ సమస్యలకు కొబ్బరి నూనెను పురాతన కాలం నుండి వాడుతున్నారు. మార్కెట్ లో దొరికే నూనె కాకుండా కొబ్బరి ముక్కలను ఆడించిన నూనె వాడితే మంచిది.
అందమైన కళ్ల కోసం నువ్వుల నూనె భేషుగ్గా పనిచేస్తుంది. కళ్లు అందంగా మెరిసిపోవాలంటే.. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు నువ్వుల నూనెను కళ్ల కింది ముడతలపై మర్ధన చేసి నిద్రించాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కళ్ల కింది ముడతలు పోయి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది.
అలాగే ఆముదం, కొబ్బరి నూనెలు కూడా కంటి కింద ముడతలకు చెక్ పెడతాయి. కొబ్బరినూనెను నిద్రించే ముందు కళ్ల కింద రాయాలి. ఉదయాన్నే లేచి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. దీని వల్ల కళ్ల కింద ముడతలు త్వరగా తగ్గిపోతాయి. చర్మంపై కొబ్బరి నూనెతో మర్ధన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవటంతో పాటు మచ్చలు తొలగిపోతాయి.
ఇక ఆముదం నూనె కూడా ముడతలు, మచ్చలపై మెరుగ్గా పనిచేస్తుంది. కళ్ల కింద ఉండే ముడతలు, మచ్చలు పోవాలంటే వాటిపై రాత్రి నిద్రపోయే ముందు ఆముదంతో మర్ధన చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/