Energy Foods: ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉందా.. అయితే ఇలాంటి ఆహారాలు తీసుకోండి!
Energy Foods: ఉదయం లేవగానే మనలో చాలా మంది నీరసం,అలసట వంటి అవితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యల నుండి బయట పడటానికి మన ఆహారంలో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహారాలను డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
మాములుగా ఉన్నప్పుడు కన్నా,వ్యాయామాలు చేసినప్పుడు మరియు జిమ్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అలాంటి సమయంలో ఎక్కువ ఆహారం తినటం కన్నా అధిక శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవటం మంచిది. అధిక శక్తి ఇచ్చే ఆహారాలను తెలుసుకుందాము.
బ్రౌన్ రైస్
దీనిలోని కార్బో హైడ్రేట్స్,ఫైబర్ ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి. మామూలు బియ్యం కన్నా బ్రౌన్ రైస్ తీసుకోవటం మంచిది.
బాదం బట్టర్
వ్యాయామం సందర్బంగా కండరాలు బలహీనం అవకుండా వీటిలో ఉండే ప్రోటిన్స్ కాపాడతాయి. అలాగే కండరాలకు శక్తిని ఇస్తాయి.
పీనట్ బట్టర్
పీనట్ బట్టర్ తీసుకోవటం వలన ఆరోగ్యం చెడిపోతుందని చాలా మంది నమ్మకం. కానీ ఇది వాస్తవం కాదని నిపుణులు చెప్పుతున్నారు. దీన్ని తీసుకోవటం వలన ఎక్కువ సేపు శక్తిని కలిగి ఉండవచ్చు. ఉదయం సమయంలో ఓట్మిల్ తో కలిపి దీనిని తీసుకోవటం వలన రోజంతా ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటుంది.
నువ్వులు
వీటిలో మాగ్నిషియం,కాపర్,కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. కీళ్ళనొప్పులను తగ్గించే శక్తి ఉంది. వీటిని ఆహారం ద్వారా తీసుకుంటే ఎముకలు,కీళ్లు శక్తివంతముగా తయారవుతాయి.
బీట్ రూట్ జ్యూస్
ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. చాలా మంది క్రీడాకారులు ఈ జ్యూస్ ను త్రాగుతారు. రోజుకి ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ త్రాగితే మందులతో చాలా వరకు పని ఉండదని నిపుణులు చెప్పుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News