Tips for Deep Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటే, పడుకునే ముందు ఈ పని చేయండి!
Tips for Deep Sleep: మారిన జీవన పరిస్థితులలో గాడనిద్ర అనేది కరువైపోతుంది. ఆహారపు అలవాట్లు,పనివేళలు గాడనిద్రను దూరం చేస్తున్నాయి. దీని వలన శారీరకంగా మరియు మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి.
గాడ నిద్ర పట్టాలంటే ఏమి చేయాలి?అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కొన్ని పద్దతులను పాటించాలి. అలాగే కొన్ని పద్దతులను వదిలివేయాలి. అప్పుడే గాడ నిద్ర పట్టటానికి అవకాశం ఉంటుంది.
చేయకూడని పనులు
నిద్ర పోవటానికి కనీసం గంట ముందు ఎలాంటి కబుర్లు,పనులు పెట్టుకోకండి. అరచేతిలో ఇమిడి పోయే సెల్ ఫోన్ మీ నిద్రను పాడుచేస్తుంది. సెల్ ఫోన్ ను పడుకొనే ప్రదేశానికి దూరంగా పెట్టండి.
వీలుంటే స్విచ్ ఆఫ్ చేయండి. పడుకొనే ముందు టీ,కాఫీ లాంటివి త్రాగకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. నిద్ర పోవటానికి గంట ముందు భోజనం చేయాలి.
చేయవలసిన పనులు
పడుకోవటానికి ముందు మంచి సంగీతం లేదా మంచి పుస్తకం చదవాలి. పడుకోనే ముందు గ్లాస్ పాలలో సోంపు వేసి మరిగించి త్రాగాలి. తలకి,అరికాలికి నువ్వుల నూనె మర్దన చేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.
అలాగే పావుగంట మేడిటేషన్ చేస్తే మంచిది. ఖర్జూరాలు,బాదంపప్పులు నీటిలో నానబెట్టి,వాటికీ కొద్దిగా గులాబీ రేకులను కలిపి ముద్దగా నూరుకొని,నీటిలో వేసి మరిగించి వేడిగా త్రాగితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News