Kitchenvantalu

Fruit & Nut Salad: ఉపవాసం చేసినప్పుడు డైటింగ్ కోసం హెల్తీ ఫ్రూట్ సలాడ్

Fruit & Nut Salad: భోజనం లోకి కూరలు, స్వీట్స్ , పచ్చళ్లు ఎలా ప్లాన్ చేసుకుంటామో, ఆరోగ్యం కోసం ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ తో సలాడ్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు
డ్రెస్సింగ్ కోసం..
చల్లని ఫ్రెష్ క్రీమ్ – 1/2కప్పు
పంచదార – 2 టీ స్పూన్స్
నానపెట్టిన బాదం – 8
మిరియలా పొడి – 1/2టీ స్పూన్
ఉప్పు – చిటికెడు

సలాడ్ కోసం..
యాపిల్ -1
పైన్ ఆపిల్ – 1 కప్పు
కర్బూజ ముక్కలు – 1 కప్పు
ద్రాక్షలు – 20
ఆరేంజ్ – 6 నుంచి 7 ముక్కలు
ఐస్ బర్గ్ లెట్స్ – కొన్ని

తయారీ విధానం
1.ముందుగా సలార్ డ్రెస్సింగ్ కోసం మిక్సీ జార్ లో ఫ్రెష్ క్రీమ్, పంచదార,నాన పెట్టిన బాదం, మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి, పేస్ట్ లా చేసుకోవాలి.
2. ఈ పేస్ట్ ను 30 నిముషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
3. ఇఫ్పుడు వేరొకగిన్నెలో ఐస్ ముక్కలు, చల్లని నీళ్లు పోసి, అందులోకి పంచదార, నిమ్మరసం వేసి కలపి పక్కన పెట్టండి.
4. తాజాగా ఉన్న యాపిల్, ముక్కలుగా తరిగి, నీళ్లలో వేసుకోండి.

5. అలాగే పైన్ యాపిల్ కర్బూజ కూడా, ద్రాక్షను కూడా కట్ చేసి పెట్టుకోండి.
6. 10 నిముషాల తర్వాత యాపిల్ తో పాటు మిగిలిన ఫ్రూట్స్ ను వడకట్టుకుని, పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడొక మిక్సింగ్ బోల్ తీసుకుని చల్లనిదానిమ్మ గింజలు, ఆరెంజ్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, వడకట్టుకున్న్ ఫ్రూట్స్, ఐస్ బర్గ్ లెట్స్, చల్లని సలాడ్ డ్రెస్సింగ్ వేసుకుని టాస్ చేయండి.
8. ఇఫ్పుడు వాటి పైన వాల్ నట్స్,ఎండుద్రాక్ష, నానపెట్టిన బాదాం కర్జూరం ముక్కలు వేసి సెర్వ్ చేసుకోండి.
Click Here To Follow Chaipakodi On Google News