Side effects of late night dinner: రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేస్తే.. ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త..!
Side effects of late night dinner: బిజీ జీవనశైలి, లేట్ నైట్ జాబ్స్ కారణంగా.. చాలా మంది రాత్రి పూట భోజనంను చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటారు. పార్టీలు, ఫంక్షన్లంటూ కూడా ఆలస్యంగా ఆహారం తింటూ ఉంటారు.
కొంతమందికైతే.. రాత్రి పూట ఆలస్యంగా తినడం అలవాటుగా మారిపోతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల కొందరు రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించరు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరైన నిద్రపోవాలని, లేకపోతే ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో బాధపడటం తప్పదని సూచిస్తున్నారు.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎక్కువగా రాత్రిపూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. అందుకే రాత్రి 9 గంటల లోపే భోజనం చేయాలని సూచిస్తున్నారు.
అంతేకాదు రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల డయాబెటిస్ -2, గుండె జబ్బులు తప్పవంటున్నారు. అందుకే పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని సూచిస్తున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News