Kitchenvantalu

Wedding Style Aloo Curry:ఇవి వేసి చేస్తారు కాబట్టే.. పెళ్లిళ్ల ఆలూ కర్రీకి అంత రుచి..

Wedding Style Aloo Curry: వంటింట్లో ఏ కూరగాయలు ఉన్నా ,లేకపోయినా ఆలు మాత్రం స్టాక్ పెట్టేస్తాం. ఫ్రై అయినా,కర్రీ అయినా,అన్నం లోకైనా,టిఫిన్స్ లోకైనా ఆలిన్ వన్ అంటే ఆలూనే. పెళ్లిల్ల స్టైల్లో ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
నూనె – ¼ కప్పు
దాల్చిన చెక్క – 1 ఇంచ్
లవంగాలు -4
సోంపు – 1 టేబుల్ స్పూన్
యాలకులు – 2
జీడిపప్పులు – 10-12
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
ఉల్లిపాయలు- 100 గ్రాములు
పచ్చిమిర్చి – 4
టమాటో- 2
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – కొద్దిగా
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
కారం – 11/4 టేబుల్ స్పూన్స్
ఉడికించిన ఆలు – 3
ఫ్రోజెన్ బఠానీ – ½ కప్పు
మటన్ మసాలా – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – ½ కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి అందులోకి దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు,సోంపు,జీడిపప్పులు వేసి ఎర్రగా వేపుకోవాలి.
2.వేగిన తాలింపులో కరివేపాకు వేసి,ఉల్లి తరుగు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
3.ఉల్లిపాయలు మెత్తపడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పచ్చిమిర్చి,వేసి కలుపుకోని టమాటో ముక్కలు వేసుకోని  గుజ్జుగా ఉడకనివ్వాలి.
4.టమాట ఉడికాక పసుపు,ధనియాల, పొడి ,కారం,నీళ్లు పోసి మసాలలోంచి నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి.

5.ఇప్పుడు అందులోకి ఉప్పు వేసి బఠాని వేసి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి.
6.ఇప్పుడు అందులోకి ఉడికించి పెట్టుకున్న ఆలు ,కొత్తిమీర,మటన్ మసాల వేసి నెమ్మదిగా కలుపుకోవాలి.
7.ఆలు విరిగి పోకుండా అడుగునుండి కలుపుకోవాలి.
8.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News