Chitti Mutyala Biryani:చిట్టి ముత్యాల బిర్యానీ ఇలా చేస్తే.. టేస్ట్ అదుర్స్.. అసలు వదిలిపెట్టరు
Chitti Mutyala Biryani: ఎన్ని వెరైటీస్ చేసినా,ఎంత స్పెషల్ గా చేసుకున్నా..బిర్యానీ తర్వాతే. తెలుగువారి ఫెవరేట్ బిర్యానీ ని చిట్టిముత్యాల తో ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
నూనె – ¼ కప్పు
అనాస పువ్వు – 1
మిరియాలు – ½ టేబుల్ స్పూన్
యాలకులు – 4
లవంగాలు – 6-7
దాల్చిన చెక్క – 2 ఇంచ్
బిర్యానీ ఆకు – 1
జీడిపప్పు – 15
ఉల్లిపాయ చీలికలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2
కాలీ ఫ్లవర్ ,క్యారెట్,బీన్స్ తరుగు – 1 కప్పు
టమాటో ముక్కలు – ¼ కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పెరుగు – ¼ కప్పు
చిట్టి ముత్యాల బియ్యం – 1 ½ కప్పులు
పుదీనా – 1 కట్ట
కొత్తిమీర – 1 కట్ట
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
వేడి నీళ్లు – 3 కప్పులు
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనే వేడి చేసి మసాల దినుసులు,జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
2.వేగిన మసాలాల్లో పచ్చిమిర్చి,ఉల్లిపాయ చీలికలు,ఉప్పు వేసి కలర్ చేంజ్ అయ్యేవరకు వేపుకోవాలి.
3.వేగిన ఉల్లిపాయల్లో కూరగాయ ముక్కలు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూతపెట్టి నాలుగు నిమిషాలు వేపుకోవాలి.
4.మగ్గిన కూరగాయ ముక్కల్లో పెరుగు,కొద్దిగా కొత్తిమీర ,పుదీనా,కారం వేసి పెరుగు కూరలో కలిసి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
5.అందులోకి తరిగన టమాటో ముక్కలు వేసి కలుపుకోని వేడి నీళ్లు పోసి హై ఫ్లేమ్ పై ఎసరుని బాగా మరగనివ్వాలి.
6.మరిగుతున్న ఎసరులో గంట సేపు నానపెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యం కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మెతుకు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పై 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి.
7.తరువాత నెమ్మదిగా కలుపుకోని బిర్యానీ పూర్తిగా ఉడకనివ్వాలి.
8.బిర్యానీ పూర్తీగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని పదిహేను నిమిషాల పాటు వదిలెయ్యాలి.
9.అంతే చిట్టి ముత్యాల బిర్యానీ తయారైనట్టే.
Click Here To Follow Chaipakodi On Google News