Beauty Tips

Hair Care Tips: షాంపూలో వీటిని కలిపి రాసుకుంటే జుట్టు రాలే సమస్యే ఉండదు..

Hair Care Tips:మనలో చాలా మంది తలస్నానం చేయటానికి షాంపూ వాడుతూ ఉంటారు. వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేస్తూ ఉంటారు. కొన్ని షాంపూలలో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే వాడే షాంపూలో కొన్ని పదార్ధాలను కలిపితే ఏ సమస్య ఉండదు.

జుట్టు రాలకుండా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ రోజుల్లో ఎవరు కుంకుడుకాయ,శీకాయ వంటి వాటిని వాడటం లేదు. అందువల్ల మనం ఇప్పుడు షాంపూలో కొన్ని రకాల పదార్ధాలను కలిపి వాడటం ఎలాగో తెలుసుకుందాం. ఇలా వాడటం వలన జుట్టు రాలకుండా బలంగా ఉండటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

షాంపూలో కొంచెం రోజ్ వాటర్ కలిపి తల రుద్దుకుంటే తలలో దురద తగ్గుతుంది.

షాంపూలో కొంచెం నిమ్మరసం వేసుకొని తల రుద్దుకుంటే జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.

షాంపూలో తేనే కలిపి తల రుద్దుకుంటే జుట్టుకు మంచి పోషణ,తేమ అంది జుట్టు నిగనిగలాడుతూ మెరుస్తుంది.

షాంపూలో ఏదైనా అరోమా నూనెను కలిపి తల రుద్దుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

షాంపూలో కలబంద కలిపి తల రుద్దుకుంటే తలలో చుండ్రు సమస్య సులభంగా తొలగిపోతుంది.

షాంపూలో ఉసిరి రసం కలిపి తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

షాంపూలో అమృతబలి రసం, బృంగరాజ్ ఆకుల రసంతో కలిపి తలను రుద్దుకుంటే జుట్టు రాలకుండా ఉండటమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా ఉండదు.

షాంపూలో వేప రసం కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News