Kitchenvantalu

Semiya Payasam:సేమియా పాయసం చిక్కబడకుండా టేస్టీ గా చేయాలంటే ఇలా చేయండి

Semiya Payasam: ఈజీగా,టేస్టీగా,ఫాస్ట్గ్ గా చేసుకునే స్వీట్ అంటే సేమియా పాయసమే. స్పెషల్ ఏదైనా సరే సేమియా స్వీట్ ఉండి తీరాల్సిందే. సేమీయా పాయసం తయారీ చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్
సేమియా – 1 కప్పు
సగ్గుబియ్యం – ¼ కప్పు
పాలు -1 లీటర్
పంచదార – ¾ కప్పు
పటికబెల్లం – ¼ కప్పు
బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్
ఎండు ఖర్జూరాలు – 2 టేబుల్ స్పూన్
పిస్తా పలుకులు- 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టేబుల్ స్పూన్స్
నీళ్లు 1 ¼ కప్పు

తయారీ విధానం
1.నెయ్యిలో సేమియా వేసి ఎర్రగా వేపుకోవాలి.
2.మిగిలిన నెయ్యిలో ఖర్జూరం,పిస్తా,వేపుకోవాలి.
3.చిక్కని పాలల్లో పావుకప్పు నీళ్లు పోసి రెండు పొంగులు రానివ్వాలి.

4.మిగిలిన నీళ్లు మరిగించి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి.
5.సగ్గుబియ్యం రంగు మారాక అందులోకి పటిక బెల్లం,యాలకుల పొడి వేసి మరిగించాలి.
6.అందులోకి పంచదార వేపుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ వేసి రెండు నిమిషాలు మరిగించాలి.
7.రెండు నిమిషాల తర్వాత సేమియా కాస్త మెత్త పడుతుంది.
8.కాచిన పాలను కలుపుకోని సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News