Healthhealth tips in telugu

Health Tips:వంటగదిలో ఉండే ఈ వస్తువులతో ఆ సమస్యలకు చెక్..

Telugu Health Tips:ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అలాంటి చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యలకులను మనలో చాలా మందికి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. కానీ దీనిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత యాలకులను తింటే ఎసిడిటి సమస్య తగ్గుతుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది. నోట్లో అల్సర్లు, ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు రెండు యాలకులను తింటే సమస్య తొలగిపోతుంది.

మనం రెగ్యలర్ గా వాడే అల్లంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. రక్త శుద్ధికి తోడ్పడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా సహాయాపడుతుంది. అల్లంను కొన్ని వారాల పాటు తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

వెల్లుల్లి రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టు సమస్య,చుండ్రు సమస్య కూడా తగ్గుతాయి. ముఖ్యంగా పేల సమస్య ఉన్నవారికి మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

పసుపులో కుర్కుమిన్ ఉండుట వలన జలుబు,దగ్గు నివారించడంలో సహాయపడుతుంది. చిటికెడు పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గటం ,మధుమేహం కంట్రోల్ గా ఉండటం ,కొలస్ట్రాల్ తగ్గటం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News