Godhuma Pindi Mysore Bajji:గోధుమ పిండితోనూ ఎంతో రుచికరమైన మైసూర్ బజ్జీని ఇలా చేసుకోవచ్చు..!
Godhuma Pindi Mysore Bajji: బజ్జీలు తినడం అందరికి ఇష్టమే..మెదలు పెడితే ఆపకుంటా తినేస్తునే ఉంటాం. కాని మైదా పిండి అంత మంచిది కాబట్టి అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకుంటాం. గోధుమ పిండితో మైసూర్ బజ్జి ట్రై చేసి చూడండి కావాల్సినన్ని తినేయ్యొచ్చు.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 400 గ్రాములు
పెరుగు – ¾ కప్పు
బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్
పంచదార – 1 టేబుల్ స్పూన్
సోడా – 1- 1 1/2 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – ½ లీటర్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 1 టేబుల్ స్పూన్
పచ్చి కొబ్బరి – 2 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ విధానం
1.వంట సోడాలో పెరుగు కలిపితే పొంగుతుంది.పొంగిన పెరుగులో రవ్వ,పంచదార,ఉప్పు వేసి కలుపుకోవాలి.
2.తరువాత గోధుమ పిండి తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా బీట్ చేసుకోవాలి.
3.కలుపుకున్న పిండిని రెండు గంటల నుండి మూడు గంటల వరకు నాననివ్వాలి.
4.రెండు గంటలు నానిన పిండి లో మిగిలిన పదార్ధాలన్ని వేసి బాగా బీట్ చేసుకోవాలి.
5.చేతిని తడిచేసుకోని బీట్ చేసుకున్న పిండిని వేడి వేడి నూనెలో బాల్స్ లాగా పిండుకోవాలి.
6.బోండాలు నూనెలో వేశాక మీడియం ఫ్లేమ్ లో ఎర్రగా వేపుకోని..కలర్ మారకా హై ఫ్లేమ్ పై వేపుకోని జల్లి గరిట తో తీసేయ్యాలి.అంతే టేస్టీ గోధుమ పిండి బజ్జీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News