Halim seeds:ఒక స్పూన్ గింజలు ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది
Halim Seeds Health Benefits: Halim Seeds లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ గింజల గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఒక స్పూన్ గింజలను నీటిలో మూడు గంటలు నానపెడితే జెల్లీలా ఉబ్బుతాయి.
ఉబ్బిన ఈ గింజలను మనం సబ్జా గింజలను ఎలా వాడతామో అలానే వాడుకోవచ్చు. వారంలో రెండు సార్లు ఒక స్పూన్ గింజలను తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది.
దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఆకలి హార్మోన్ ‘గ్రెలిన్’ ని నియంత్రించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది. మలబద్ధకం మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యల చికిత్సకు సమర్థవంతమైన నివారణ అని చెప్పవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి కడుపు నొప్పి వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ గింజలలో ఐరన్ చాలా సమృద్దిగా ఉంటుంది.
రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమానికి 1 స్పూన్ నిమ్మరసాన్ని కలిపితే నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇనుమును బాగా గ్రహించేలా చేస్తుంది.
ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో దోహదపడే అనేక సమ్మేళనాలు ఈ గింజలలో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే, ఈ సూపర్‌ఫుడ్‌లను నమలడం వల్ల దగ్గు మరియు గొంతు నొప్పి చికిత్సలో సహాయపడుతుంది. కాబట్టి, సీజనల్ మార్పుల సమయంలో మీ ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News