BusinessKitchen

ప్రతి వంటగదిలో ఉండవలసిన అతి ముఖ్యమైన వస్తువు.. పైర్‌ బ్లాంకెట్‌

Fire blanket for kitchen:వంటింటిలో పని చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పిండి వంటలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి మంటలు రావడం వంటివి చూస్తూనే ఉంటాం.అలాంటి సమయంలో చాలా మంది నీటిని జల్లటం లేదంటే దగ్గర్లో ఉన్న వస్త్రాన్నో తీసుకుని మంటని అదుపు చేయటానికి ప్రయత్నం చేస్తారు.

ఇలా చేయటం వలన ఒక్కోసారి ప్రమాద తీవ్రత పెరగవచ్చు. అలా కాకుండా పైర్‌ బ్లాంకెట్‌ని కిచెన్‌లో అందుబాటులో ఉంచుకుంటే మంటలు ఆర్పేందుకు సహాయపడతాయి. ఆ కిట్‌పై రాసి ఉన్న నిబంధనలు అనుసరించి బ్లాంకెట్‌ని ఉపయోగిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు.