Healthhealth tips in telugu

Constipation: మలబద్దకం సమస్య వేధిస్తుందా…? ఈ టిప్స్ పాటించి నివారించుకోండి

Constipation Home remedies:ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి,ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినటం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో మలబద్దకం సమస్య ఎక్కువగా వినిపిస్తుంది.

చిన్నపిల్లల దగ్గర్నుంచి ముసలివాళ్ల వరకూ అందరినీ విసిగించే సమస్య మలబద్దకం. అది రావడానికి గల కారణాన్ని బట్టి, తీవ్రతను బట్టి, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

మలబద్దకం ఉన్నవాళ్లు రోజుకు కనీసం 3-4 లీటర్ల మంచినీళ్లు తాగాలి. వేడి పాలు తాగితే మలబద్దకం నుండి ఉపశమనం కలుగుతుంది. అరటిపండులోని పోషకాలు మలబద్దకాన్ని నివారించి, విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా రోజుకు 1 లేక 2 అరటిపళ్లు తినడం మంచిది.

ధనియాల పొడిని అన్నంతో కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. క్రమం తప్పకుండా ఉదయం వేళ మజ్జిగ తేట తాగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే కాల్షియం దండిగా ఉండే పెరుగు, మజ్జిగ వల్ల పేగులు సడలి సుఖవిరేచనం అయ్యే అవకాశం ఉంది.

కాఫీ, టీలు మలబద్దకాన్ని పెంచుతాయి. కాబట్టి వాటిని మానేయాలి. ఒక్కసారిగా మానేయలేకపోయినా మెల్లమెల్లగా మోతాదు తగ్గించడం మంచిది. పీచుతో కూడిన ధాన్యాలు, బ్రెడ్ తినటం మంచిది.

సమతులాహారం తీసుకోవటం అవసరం. ఇందులో శుద్ధి చేయని తృణ ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, తేనె, పళ్లు, ఎండుఫలాలతో పాటు వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

జామపండ్లు, యాపిల్, క్యారెట్ రసం, గోధుమలు, బత్తాయిపళ్లు, క్యాబేజీ, బొప్పాయి, చిలగడదుంప, కొబ్బరి… ఇవన్నీ మలబద్దకాన్ని నివారించేందుకు దోహదం చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News